Plastic ban: 17 కార్పొరేషన్లలో ప్లాస్టిక్ బ్యాన్ అమలు... సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి!
Tue Jun 17, 2025 17:01 Politics
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి రాష్ట్రంలోని 17 ప్రధాన నగరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నట్టు ప్రకటించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి వంటి కార్పొరేషన్లలో ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. సచివాలయంలో నిర్వహించిన 'సర్క్యులర్ ఎకానమీ'పై సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో అవసరమైన యంత్రాలను పెంచాలని, క్షేత్రస్థాయిలో స్వచ్ఛతకు కృషిచేసిన వారికి అవార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్లాస్టిక్ నిషేధంతో పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగుగా ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #plastic #ban #cm #chandrababu #naidu #focus #17 #corporations #implementation
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.